కొరటీకల్ జిపఉపాలో శిక్షా సప్తాహా కార్యక్రమం
On
వివిధ పండుగలు, జాతీయ దినోత్సవాలపై విద్యార్థులలో అవగాహన
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటీకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహా కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జాతీయ సమైక్యత అంశంలో విద్యార్థులు దేశంలో జరిగే వివిధ పండుగలు, జాతీయ దినోత్సవముల ప్రత్యేకతను తెలుసుకొనుటకు గాను శిక్షా సప్తాహా కార్యక్రమమును నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి వెంకన్న , ఉపాధ్యాయులు స్వామి , రవి , వరప్రసాద్ , శ్రీనివాసచారి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.