ఎస్సీ వర్గీకరణ ఘనత బీజేపీది కాదు - గజ్జల కాంతం

ఎస్సీ వర్గీకరణ ఘనత బీజేపీది కాదు - గజ్జల కాంతం

విశ్వంభర,హైద్రాబాద్: ఎస్సీ వర్గీకరణ ఘనత బీజేపీది కాదని గజ్జల కాంతం అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు పోరాటం చేస్తున్నారని,ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీం కోర్ట్ కు చేరినా మాదిగలకు న్యాయం జరగలేదని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం కూడా వర్గీకరణను కోరితే అక్కడ హై కోర్ట్ దీన్ని కొట్టివేసిందని పేర్కొన్నారు.అప్పుడు పంజాబ్ ప్రభుత్వం దాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో కేస్ వేశారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పోరాటం చేసింది కాబట్టే ఈరోజు న్యాయం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కారణం బీజేపీ అని కొందరు మాట్లాడుతున్నారని, అయితే వర్గీకరణ జరగాలని కోరుకుంటే మోదీ పార్లమెంట్లో బిల్ ను ఎందుకు పాస్ చేయలేదంటూ మండి పడ్డారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం కోర్ట్ కి అడ్వొకేట్లను పంపారని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకలో వాదించేందుకు ఎందుకు చొరవ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు