విభజన హక్కులను సాధించాలి.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి డిమాండ్..!

విభజన హక్కులను సాధించాలి.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి డిమాండ్..!

కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి. టీడీపీ నుంచి ఇద్దరు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దాంతో పాటు ఏపీ బీజేపీ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. 

ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మాత్రమే ఛాన్స్ వచ్చింది. దాంతో కొత్త మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమర్, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

Read More ఉడ్ -బాల్  టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రభంజనాలు 

ఇక రెండు రాష్ట్రాల విభజన హక్కులను సాధించాలని కోరారు. కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు రేవంత్ రెడ్డి.