వచ్చే ఎన్నికల్లోపు రిజర్వేషన్లు, నియోజకవర్గాలు పెరుగుతాయిః కిషన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లోపు రిజర్వేషన్లు, నియోజకవర్గాలు పెరుగుతాయిః కిషన్ రెడ్డి



Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 


Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోపు రిజర్వేషన్లు, నియోజకవర్గాలు పెరుగుతాయని తెలిపారు. ఈ రాబోయే ఐదేండ్లు చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ హయాంలో చాలా కొత్త మార్పులు ప్రజలు చూస్తారని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

నియోజకవర్గాలు మారుతాయని, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు అవకాశాలు బాగా పెరుగుతాయని.. వచ్చేసారి పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. 

ఇక తెలంగాణలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మాదిరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలాంటి పనులు చేయట్లేదని విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. దాంతో ఆయన చేసిన కామెంట్లపై అటు బీఆర్ ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కూడా విమర్శళు గుప్పిస్తున్నాయి.