ఆగిపోయిన రావిచేడు బ్రిడ్జి నిర్మాణం - స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
తొందరగా పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశం
విశ్వంభర, కేశంపేట్ : కేశంపేట్ మండల కేంద్రంలో రావిచేడ్ రోడ్ లోని రైతులు తమ పంట పోలాలకు అనుసందానంగా ఉన్న ప్రదాన కాలువకి (వాగుకు) బ్రిడ్జ్ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు సరిపొకపోవడంతో నిర్మాణం సగంలోనే ఆగీపోయింది. కేశంపేట్ మాజీ సర్పంచ్ యెన్నం శ్రీధర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, రెండు వైపులకు గోడ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మిగతా అమౌంట్ చెల్లిస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాగును సందర్శించిన పంచాయతి రాజ్ డిప్యూటి ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ భూపాల్, మాజీ సర్పంచ్ యెన్నం శ్రీధర్ రెడ్డి, యెన్నం శ్రీకాంత్ రెడ్డి, కోడిపర్తి శ్రీకాంత్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు మంచె కృష్ణయ్య, దశరథ, కోడిపర్తి రంగారెడ్డి, పిట్టల బాలరాజ్, తలసాని కృష్ణరెడ్డి, రమణా రెడ్డి, బండ స్వామయ్య, తలసాని శేఖర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.