రాపోలు వీర మోహన్ కు వినతి పత్రం అందజేత 

చేనేత పారిశ్రామిక సహకార సంఘం సమస్యలపై కలిసిన ప్రతినిధులు

రాపోలు వీర మోహన్ కు వినతి పత్రం అందజేత 

విశ్వంభర,  కరీంనగర్ :- పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన  బీసీ రాజ్యాధికార సభకు తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పాల్గొన్నారు. బీసీ సభలో ఆయన మాట్లాడుతూ బీసీ ల చట్టబద్దత అంశంపై అటు వక్తలకు , ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. బీసీ ల రాజ్యాధికారం సాధించేంతవరకూ అన్ని కులాలు సంఘటితంగా పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం జగిత్యాల జిల్లా కోరుట్ల చేనేత పారిశ్రామిక సహకార  సంఘ సమస్యలను పూర్వ అధ్యక్షులు గోనె శంకర్ ఆధ్వర్యంలో చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు వినతిపత్రం అందజేశారు. కాసేపు వారితో సమస్యలపై ముచ్చటించి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ చేపట్టి సంఘ పునర్ నిర్మాణం కొరకు కృషి చేస్తామని అన్నారు. వీరితో పాటు రుద్ర సుధాకర్ , లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

Tags: