మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి రాపోలు చేయూత. - చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ 50 కేజీ ల బియ్యం అందజేత 

మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి రాపోలు చేయూత.  - చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ 50 కేజీ ల బియ్యం అందజేత 

విశ్వంభర, హైద్రాబాద్ :- కిడ్నీ వ్యాధితో మరణించిన చేనేత కార్మికుడు చండూర్ వాసి వర్కాల వేణుగోపాల్  కుటుంబానికి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ యాభై కేజీ ల బియ్యాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన వారి సిబ్బంది ద్వారా బియ్యం అందజేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చేనేత కార్మికుల జీవితాలు అంధకారంలో ఉన్నాయని , చిన్ననాటి నుండి చేనేత వృత్తినే ఆధారం చేసుకొని , ఆర్ధిక కష్టాలను అధిగమించడానికి నిరంతరం చేనేత పని చేసుకొని జీవిస్తున్న ఎంతో మంది చేనేత కార్మికులు అనారోగ్యాల పాలై ప్రాణాలు వదులుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా చేనేత కార్మికుల ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన జీవితాలకు ప్రభుత్వం  భరోసా కల్పించే దిశగా కృషి చేయాలనీ అన్నారు.

Tags: