నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి
విశ్వంభర, దేవరకొండ : తెలంగాణలో వర్షాకాలం సీజన్ ప్రారంభైనందున రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అన్నారు. రైతులు దళారీల వద్ద మోసపోకుండా నాసిరకమైన మందులను అరికట్టాలని అధికారులను కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పోలే వెంకటయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వానాకాలం రైతుబంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ త్వరగా ప్రారంభించాలన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని ఆస్పత్రికి రోజుకు 1000 నుండి 1200 ఓపి రోగులు వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ దూర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్న సందర్భంలో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓపి ఫీజు 300 రూపాయల తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండి మైనుద్దీన్, ఉప్పునూతల వెంకటయ్య, ఎస్.కనకాచారి, నూనె రామస్వామి, దీప సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.