ఇంటింటా ఇన్నోవేటర్ కు ప్రతిపాదనలు పంపాలి
On
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : -వ్యవసాయానికి సంబంధించి తయారు చేసుకున్నటువంటి వ్యవసాయ పనిముట్లని ప్రమోట్ చేయడానికి ఇంటింటా ఇన్నోవేటర్ కు ప్రతిపాదనలు పంపాలని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ తెలిపారు. సోమవారం వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో ఇంటింటా ఇన్నివేషన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ అధికారులు రైతులకు ప్రజలు తెలియచేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలను పంపాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకై
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఆవిష్కరణల సమన్వయ కర్త
జాడి నరేందర్ 9440411878 తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నకు కాల్ చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జాడి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.