జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్‌

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
 
కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ శ్రేణులు
 
హాజరైన మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్

 

WhatsApp Image 2024-07-24 at 12.45.23_a4557c95

విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుకు లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ జన్మదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజకీయంలో యువతకు ఆదర్శం మాజీ మంత్రి కేటీఆర్ అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెండే కృష్ణయ్య యాదవ్,వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్, సోమ్లా నాయక్,అనిత శ్రీనివాస్ గౌడ్, పీర్లగూడెం మాధవి గోపాల్ గౌడ్,బ్యాగరి ప్రసన్న లత యాదయ్య,మాజీ సర్పంచులు కాట్నా రాజు,రమాదేవి రమేష్, బ్యాగరి సత్తయ్య,మాజీ ఎంపిటిసి అనురాధ కృష్ణ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగ గళ్ళ శివకుమార్,బిఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు కడాల శ్రీశైలం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్లెం నరసింహారెడ్డి, బ్యాగరి రాజు,జంగయ్య యాదవ్, నరసింహ గౌడ్,రాములు గౌడ్,దేశాల జైపాల్,రవి నాయక్,బండి శ్రావణ్,రాజశేఖర్, దామోదర్ రెడ్డి,దేశాల భీమయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్