ఎమ్మెల్యే భార్య మృతిపై పోలీసుల వివరణ.. అనారోగ్యంతోనే సూసైడ్

ఎమ్మెల్యే భార్య మృతిపై పోలీసుల వివరణ.. అనారోగ్యంతోనే సూసైడ్

 

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు 

 

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అల్వాల్ లోని ఇంట్లో ఆమె ఉరేసుకుని చనిపోయింది. ఆమె గురువారం సాయంత్రమే చనిపోయినా.. అర్ధరాత్రి ఈ విషయం బయటకు వచ్చింది. 

కాగా ఒక ఎమ్మెల్యే భార్య అయిన ఆమె ఎందుకు చనిపోయిందా అని అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసుల ఆమె మృతిపై వివరణ ఇచ్చారు. రూపాదేవి అనారోగ్యంతోనే చనిపోయిందని నిర్ధారించారు. ఆమెకు గత మూడేండ్లుగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. 

ఆ నొప్పి భరించలేకనే ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఆమె చనిపోయే ముందు కూడా భర్త, తల్లికి వీడియో కాల్ చేసి ఇదే విషయం చెప్పింది. ఇక రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె తల్లి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది.