ప్రజల ఫిర్యాదులను పెండింగ్‌ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలి.

WhatsApp Image 2024-07-22 at 16.42.24_9f72fe6fవిశ్వంభర  భూపాలపల్లి జూలై 22 : -  ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16  ఫిర్యాదులను ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ  స్వీకరించారు. ప్రతి పిర్యాదుపై విచారణ జరిపి  బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు అన్నారు.