ఆమనగల్లు ఎక్సైజ్ కార్యాలయంలో తాటి, ఈత మొక్కలు
విశ్వంభర, ఆమనగల్లు, జులై 19: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవంలో భాగంగా ఆమనగల్ ఎక్సెజ్ పరిధిలోని 20 వేల తాటి ఈత ఖర్జూర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సీఐ బధ్యనాథ్ చౌహాన్ తెలిపారు. తలకొండపల్లి మండలంలోని గురువారం బదనాపూర్ గ్రామంలో ఆమనగల్ ఎక్సెజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ హాజరై ఈత మొక్కలు నాటారు.
ఆమనగల్ ఎక్సైజ్ పరిధి లోని ప్రతి గ్రామంలో గౌడ కులస్తులందరూ ప్రభుత్వం ఖర్జూర, ఈత, తాటి లాంటి మొక్కలు నాటుకొని లబ్ధి పొందాలని సిఐ తెలిపారు. బదనాపూర్ గ్రామంలోని కృష్ణ గౌడ్, శివకుమార్ గౌడ్ ల వ్యవసాయ పొలములో 1000 వరకు ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. ఎవరైనా ఈతమొక్కలు, తాటి మొక్కలు పెంచడానికి కావాలనుకుంటే ఆమనగల్ ఎక్సెజ్ కార్యా లయాన్ని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, లోయ, రాణి గ్రామస్తులు పాల్గొన్నారు