ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పుపై చైతన్యపురి ఛత్రపతి శివాజీ చౌరస్తాలో మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలభిషేకం
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఘనంగాపాలాభిషేకం
విశ్వంభర రంగారెడ్డి :ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పుపై చైతన్యపురి ఛత్రపతి శివాజీ చౌరస్తాలో మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలభిషేకం చేస్తూ సంబరాలను ఘనంగా మాదిగలు నిర్వహించారుఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల మూడు దశాబ్ధాల పోరాటానికి తెరపడింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబరాలు అంబరాన్నంటాయి. మందకృష్ణ మాదిగ మూడు దశాబ్ధాల ఉద్యమానికి ఫలితం లభించింది. 1972 నుంచి మొదలుకుని మారిన ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మందకృష్ణ మాదిగ.. అర్థమయ్యేలా వివరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీనికోసం తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. చివరకు మందకృష్ణ పోరాటానికి ప్రధాని కరిగిపోయారు. మాదిగలకు సపోర్ట్ చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. గతేడాది హైదరాబాద్ లో నిర్వహించిన ‘మాదిగ విశ్వరూప మహాసభ’ సభకు ప్రధాని హాజరై వారికి మద్దతు తెలియజేశారు. చివరకు కోర్టు తీర్పు వర్గీకరణను సమర్థించింది. మందకృష్ణ మాదిగ విజయం సాధించడంతో ఘనంగా మాదిగలు సంబరాలు జరుపుకుంటున్నారు
ఈ కార్యక్రమంలో DBSA DMSA BHEEM DRUM FOUNDER Dr NALAGSNTI SARATH CHAMAR,కాచం సత్య నారాయణ ,విశ్వంభర పత్రిక చైర్మన్,కొమ్ము బిక్షమయ్య, డీబీఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ ,జంగిల్ దర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు ,డిబిఎస్ఏ స్టేట్ స్పోక్ పర్సన్,ఉస్మానియా యూనివర్సిటీ ,పీహెచ్డీ రీసెర్స్ స్కాలర్ LLB ,కాసర్ల మధుసూదన్ ,కాసర్ల సైదులు ,యేల్లు అశోక్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,సంపత్ రెడ్డి,పల్స జనార్ధన్ గౌడ్,విప్లవ్ వినయ్,దారమళ్ళ రమేశ్,సతీష్ అంజి ,సిరిపంగి లక్ష్మన్ , ఎస్ఎం హెచ్ హాస్టల్ విద్యార్థులు నరేందర్ , అంజి , వినయ్, రజిని, రాకేష్,చిన్నబాబు శ్రావణ్,శ్రీకాంత్ సిరిపంగి రవి,కొమ్మరబోయిన మహేష్ యాదవ్,మాదిగ దండోరాఉద్యమకారులు,దళిత బహుజన నాయకులు ,సామాజిక సంఘ కర్తలు ,తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులు వివిధ కుల సంఘాల నేతలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మేధావులు తదితరులు పాల్గొన్నారు...