అన్యమతస్థులని తొలగించాలి - ఆర్యవైశ్య సంఘం డిమాండ్ 

అన్యమతస్థులని తొలగించాలి - ఆర్యవైశ్య సంఘం డిమాండ్ 

 ప్రతి గుడిలో హిందువులే ఉండాలి -  2 తెలుగు  రాష్ట్రాలకు ఆర్యవైశ్య సంఘం డిమాండ్ 

విశ్వంభర, హైద్రాబాద్ : ప్రతి గుడిలో అన్యమతస్తులు ఉండకుండా హిందూ మతస్తులే ఉండాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు  కొత్తపేట ఆర్యవైశ్య సంఘం  డిమాండ్ చేసారు.  తిరుపతి లడ్డు అపవిత్రం చేసినటువంటి మూర్ఖులకు తగినటువంటి బుద్ధి చెప్పాలని ఆ దేవుని వేడుకుంటూ అలాగే హిందువులందరూ ఐక్యమత్యం గా ఉండాలని అన్నారు.  అలాగే ప్రతి దేవాలయంలో ధర్మ ప్రచారక కార్యక్రమాలు నిర్వహించాలని,  దేవాలయానికి వచ్చే భక్తులకు హిందూ ధర్మం గురించి గోమాత గురించి మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేయాలని తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో  ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా,  రేణిగుంట శ్రీనివాస్,  అరువేపల్లి శ్రీనివాస్, బుక్క రమేష్, రిషి రాంప్రసాద్  ఆలయ అర్చకులు , హిందూ బంధువులు పాల్గొన్నారు. 

 

Read More  కేటీఆర్ వాహనం పై దాడి .. తృటిలో తప్పిన ప్రమాదం 

 

Read More  కేటీఆర్ వాహనం పై దాడి .. తృటిలో తప్పిన ప్రమాదం 

Tags: