బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా నర్సింగం
విశ్వంభర, కేసముద్రం : బిఆర్ఎస్ పార్టీ కేసముద్రం పట్టణ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీ నగర్ కు చెందిన నర్సింగం వెంకటేశ్వర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసముద్రం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగుర వేయాలని తెలిపారు. 16 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాయ మాటలతో గద్దె నెక్కి నేడు ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రజలు బుద్ది చెప్పాలని పేర్కొన్నారు. అనంతరం పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతలను తుచా తప్పకుండ పాటిస్తూ, పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. కేసముద్రం మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగుర వేస్తామని పేర్కొన్నారు. తన ఎన్నిక కు సహాకరించింన బిఆర్ఎస్ మండల, పట్టణ నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.



