ఆందోల్ మైసమ్మ ఆలయంలో మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు
రాష్ట్ర ప్రజలందరికి తోలి ఏకాదశి శుభాకాంక్షలు -కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆందోల్,చౌటుప్పల్ :విశ్వంభర :-తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానానికి విచ్చేసిన కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. అనంతరం ఆందోల్ మైసమ్మ దేవస్థానం 19వ బోనాల ఉత్సవ ఆహ్వాన గోడపత్రికను ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రజలందరికి తోలి ఏకాదశి సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.