సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

 

Read More తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్

విశ్వంభర, ఎల్బీనగర్ : - 
ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు  డ్రైనేజీ , నీటి సమస్యల తో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని సోమవారం ఉదయం బస్తీ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 
ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, మంచి నీటి సమస్య ను వెంటనే పరిష్కారం చేయాలి అని అధికారులకు సూచించారు. 
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎలక్ట్రికల్ పోల్స్ సంబంధిత విషయాలపై సబితా ఇంద్రారెడ్డి  దృష్టికి తీసుకురాగా వాటికి త్వరలో ప్రపోజల్ పెట్టి పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు, కాలనీలో మిగతా ఏమైనా సమస్యలు ఉంటే డ్రైనేజీ గాని రోడ్లు కానీ వాటి కూడా ప్రపోజల్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
 ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ,WhatsApp Image 2024-07-22 at 13.12.29_f9daf0c6
డివిజన్ అధ్యక్షులు  పెండ్యాల నగేష్, న్యలకొండ శ్రీనివాస్ రెడ్డి , గొడుగు శ్రీనివాస్, సాజిద్ , కొండ్ర శ్రీనివాస్, శ్యామ్ గుప్త ,శ్రీమన్నారాయణ, వెంకటేష్ గౌడ్ ,పెంబర్తి శ్రీనివాస్ ,అనురాధ , స్వప్న రెడ్డి,
శ్రీకాంత్ గౌడ్, అఫ్సర్, ఇస్మాయిల్, మహేందర్, కుమార్, దీపు, కౌసల్య,యాదగిరి,సోములు,
 నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.