కెసిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సబితా
విశ్వంభర, గజ్వెల్ : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఎండకడుతూ ఉండాలని సూచించినట్లు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మాటల్లో తప్ప చేతల్లో ప్రభుత్వ పనితీరు కనబడతలేదని, రుణమాఫీ కొంతమంది రైతులకే లబ్ధి చేకూరిందని, వివిధ కారణాలతో వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురు కుంట్ల అరవింద్ శర్మ, ఆర్కే పురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, గొడుగు శ్రీనివాస్, సాజిద్, జగన్మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, పెంబర్తి శ్రీనివాస్, మురళీధర్ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.