చామలపల్లి జాతరలో MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు
On
తొలి ఏకాదశి సందర్బంగా నియోజకవర్గం లోని పలు దేవాలయాల సందర్శన
చామలపల్లి,చండూరు- విశ్వంభర :- తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా చండూరు మండలం చామలపల్లి గ్రామంలో జరుగుతున్నా శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి జాతర కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి లక్ష్మి దంపతులు పాల్గొనడం జరిగింది.జాతర కు విచ్చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి - లక్ష్మి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులూ ,ప్రజా ప్రతినిధులు ,కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.