మిషన్ భగీరథ అధికారులతో MLA కోమటిరెడ్డి సమావేశం 

మిషన్ భగీరథ అధికారులతో MLA కోమటిరెడ్డి  సమావేశం 

మునుగోడు నియోజకవర్గంలో  త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి

మోటార్ల కెపాసిటీ పెంచడానికి ప్రపోజల్స్ రెడీ చేయండి

 

 విశ్వంభర, మునుగోడు నియోజక వర్గం :  నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ గ్రిడ్  పనుల తీరు పై అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  సమీక్ష నిర్వహించారు.  లింగోటం నీటి శుద్ధి కేంద్రం నుండి  మునుగోడు నియోజకవర్గానికి  జరిగే నీటి సరఫరా ఎలా ఉంది? ఎంతవరకు సరిపోతుంది.? ఇంకా ఎంత అవసరం ఉందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని  చౌటుప్పల్ మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ తాగునీటి కేటాయింపులు జరగలేదని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి కేటాయింపులు  పెంచాలన్నారు... దీనికోసం మోటార్ల కెపాసిటీ పెంచాల్సి ఉంటుందని  ఎమ్మెల్యే దృష్టికి  అధికారులు తీసుకురాగా  వెంటనే మోటార్ల కెపాసిటీ పెంచడానికి కావలసిన ప్రపోజల్స్ పంపించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే కాలంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరు చౌటుప్పల్ మున్సిపాలిటీలో  తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, భవిష్యత్తు జనాభాను దృష్టిలో ఉంచుకొని తాగునీటి కేటాయింపులు జరగాలని  కోరారు. వచ్చే వేసవి వరకు  నియోజకవర్గంలో  తాగునీటి కొరత లేకుండా మిషన్ భగీరథ ద్వారా  ప్రతి ఇంటికి నీటిని అందించాలన్నారు..

 

Read More బాపూజీకి నివాళులు అర్పించిన నల్గొండ ఎంపీ 

 

Read More బాపూజీకి నివాళులు అర్పించిన నల్గొండ ఎంపీ 

Tags: