వీరన్న చెరువు గండిని పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
On
విశ్వంభర, తలకొండపల్లి: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వీరన్న చెరువు గండిపడి కట్ట తెగిపోవడంతో విషయం తెలుసుకున్న కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెంటనే స్పందించి చెరువుని సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువు కావాల్సిన పూర్తి స్థాయి మరమ్మత్తులను ఏఈ తో మాట్లాడి చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, సింగల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, దేవుని పడకల్ గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం, కాసు శ్రీనివాస్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీశేలం, ఉపాధ్యక్షుడు తిరుపతి, బిక్షపతి, జగ్గారెడ్డి, మల్లేష్ మహేష్ , లక్ష్మీనారాయణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.