ప్రథమ ప్రాధాన్యత విద్యకే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన
1100 వందల కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు
స్కూల్స్ రీ ఓపెనింగ్ లో పాల్గొన్న మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రథమ ప్రాధాన్యత విద్యకే ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. గత పదేండ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో అలియా మోడల్ హైస్కూల్ లో పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.
ఆయనతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక స్కూళ్ల రీ ఓపెనింగ్ లో భాగంగా విద్యార్థులకు సన్మానం చేశారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా స్టూడెంట్లకు పుస్తకాలు, యూనిపాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు.
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ముందస్తు చర్యలు తీసుకుని మరీ రాష్ట్రంలోని 26 వేల స్కూల్ లకి 11 వందల కోట్ల తో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యుత్ ,డ్రింకింగ్ వాటర్ ,టేబుల్స్ ఇలా అన్ని వసతులతో స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇన్నేళ్లుగా బీఆర్ ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను ఎవరూ పట్టించుకోలేదు.
కానీ కాంగ్రెస్ హయాంలో కచ్చితంగా విద్యా వ్యవస్థకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. స్టూడెంట్లకు యూనిఫాం, పుస్తకాలు, కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ స్టూడెంట్లు రాణించడమే మా లక్ష్యం అని తెలిపారు. ఇందుకోసం ఇప్పటకిఏ కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించినట్టు తెలిపారు.