‘ఆనంద ఆహారం’ మెనూ చూస్తేనే నోరూరుతుంది : మంత్రి కోమటిరెడ్డి

‘ఆనంద ఆహారం’ మెనూ చూస్తేనే నోరూరుతుంది : మంత్రి కోమటిరెడ్డి

విశ్వంభర, నల్లగొండ : నిరుద్యోగులు ఉద్యోగాలే పరమవది అని ఎదురు చూడకుండా బిజినెస్‌లు స్థాపించి యువతకు ఆదర్శంగా నిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ రూరల్ పరిధి చర్లపల్లి హైవేపై ‘ఆ ఆనందం ఆహారం’ ఫ్యామిలీ రెస్టారెంట్, దాబాను  ప్రారంభించి మాట్లాడారు. ఆ ఆనంద ఆహారం రెస్టారెంట్ రుచికి, శుచికి, నాణ్యతకు మారుపేరుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రెస్టారెంట్ మెనూ చూస్తేనే నోరూరుతుందని అన్నారు. నల్లగొండ జిల్లా భోజన ప్రియులకు కమ్మనైన వంటకాలను అందించేందుకు రెస్టారెంట్‌ను నెలకొల్పిన కాచం సంతోష్, జిల్లా సాయి లక్ష్మణ్‌ను మంత్రి అభినందించారు. వీ3 న్యూస్, విశ్వంభర దినపత్రిన చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే విజయాలు దాసోహం అవుతాయని తెలిపారు. నార్కెట్ పల్లి - అద్దంకి హైవేపై ఏపీ, తెలంగాణ భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న యువకులను ఆయన ప్రొత్సహించారు. ఆనంద ఆహారం విజయవంతంగా మరిన్ని బ్రాంచీలను ప్రారంభించాలని కాచం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,  మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవదినం, మున్సిపల్ కౌన్సిలర్లు బొజ్జ శంకర్, ఏర్పుల దర్శన రవికుమార్, భీష్మారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు కాచం శంకర్, కాచం సాయి తదితరులు పాల్గొన్నారు.

IMG-20240617-WA0005IMG-20240617-WA0008

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ