మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రమాదంలో మృతి చెందిన షేక్ నజీర్ కుటుంబానికి 1,00,000/- (లక్ష రూపాయల) ఆర్థిక సహాయం..
కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ద్వారా కుటుంబానికి అందజేత..
కనగల్ ,విశ్వంభర :- ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన షేక్ నజీర్ రాయి పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రాయి మీద పడి ఈ నెల 24న మృతి చెందాడు.ఈ విషయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మంత్రి లక్ష రూపాయలను ఆ కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. మానవత్వంతో ప్రమాదంలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ అధ్యక్షుడు కూసుకుంట్ల రాజిరెడ్డి,చర్లగౌరారం మాజీ సర్పంచ్ వెంకన్న పలువురు బుధవారం మృతుడు షేక్ నజీర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంపించిన రూ.లక్ష నగదును మృతుని భార్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకరాజు శ్రీను,శ్రీశైలం,దొడ్డి సైదులు,మురళి,ఇస్లాంనగర్ గ్రామ పెద్దలు,ఖాదర్,షబ్బీర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పాల్గొన్నారు..