మెట్ పల్లి ప్రెస్ క్లబ్ (వర్కింగ్ జర్నలిస్ట్  ) నూతన కార్యవర్గం ఏర్పాటు....

WhatsApp Image 2024-07-05 at 3.31.42 PM

తేదీ 5-6-2024 శుక్రవారం రోజున మెట్ పల్లి ప్రెస్ క్లబ్  (వర్కింగ్ జర్నలిస్ట్) నూతన కార్యవర్గ సమావేశం స్థానిక ఆర్బీ రెస్టారెంట్ లోని సమావేశ హాలు లో  సీనియర్ పాత్రికేయులు సౌడాల కమలాకర్ గారి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. 
ఈ సమావేశంకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు ఈ సమావేశoలో  పాల్గొన్నారు...అనంతరం ప్రెస్ క్లబ్ కో -ఆర్డినేషన్  చెర్మన్  గా సౌడాల కమలాకర్ , న్యాయ సలహా దారుగా అలాల శంకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది...

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు 

  • సౌడాల కమలాకర్ కో - ఆర్డినేషన్ కమిటీ  చెర్మన్,
  • అలాల శoకర్ (నమస్తే తెలంగాణ ఆర్ సి ఇంచార్జ్ )న్యాయ సలహాదారులు ,
  • కోరుకంటి విజయ్ కుమార్ (NTV రిపోర్టర్  ) సహా  కో - ఆర్డినెటర్ ,
  • మన్నెని వేణు రావ్( అంధ్రజ్యోతి టౌన్ ) సహా  కో - ఆర్డినేటర్ ,
  • ఏనుగందుల గోపి గౌడ్( టీ న్యూస్ ) ముఖ్య సలహదారులు,
  • మహమ్మద్ షౌకత్ (వెలుగు  టౌన్)ముఖ్యసలహదారులు,

WhatsApp Image 2024-07-05 at 3.31.41 PM
ముదాం శ్రీనివాస్( ZEE తెలుగు)కోశాధికారి 
అనుపురం సతీష్  (BIG TV) ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఎన్నుకోవడం జరిగింది . అనంతరం కో ఆర్డినేషన్ చైర్మన్  సౌడాల కమలాకర్ గారిని సీనియర్ పాత్రకేయ మిత్రులు అలాల  శంకర్ మరియు క్లబ్ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్బంగా సౌడాల కమలాకర్ గారు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఈ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశామని ఈ ప్రెస్ క్లబ్ ఉన్న సభ్యులు కేవలం వర్కింగ్ జర్నలిస్ట్ లు మాత్రమే ఉంటారని ఆయన తెలిపారు.ఈ ప్రెస్ క్లబ్ ముఖ్య ఉద్దేశం సొంత ప్రయోజనాలకు కాకుండా  సమాజo లో జరిగే ఆవినితి పై నిజాలను నిర్భయంగా బయట పెట్టె ప్రతి ఒక్క విలేకరికి అండగా ఉంటుందని తెలిపారు.