సురవరం సుధాకర్ రెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ
On
విశ్వంభర, హైద్రాబాద్ : సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి మొదటి నుండి మద్దతుగా ఉన్న సీపీఐ పార్టీ నేత సురవరం సుధాకర్ రెడ్డిని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి మంద కృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను సురవరం సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.