ఐపీఎస్ సబర్వాల్ పై చట్టరితే చర్యలు తీసుకోవాలి.

ఎన్ పి ఆర్ డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి.
 
షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

 

WhatsApp Image 2024-07-23 at 14.56.47_576d0137

విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - వికలాంగులను కించపరిచే విదంగా పోస్ట్ పెట్టిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై శరత్ కుమార్ కు ఐపీఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్అధికారి శ్రీ మతి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21నాడు ట్విట్టర్ లో అంధుడిని కారు డ్రైవరుగా నియమిస్తామా? వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా ' అని పోస్ట్ పెట్టినారు. దీంతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 RPWD చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైంది.వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేశారు.2016 RPWD చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి  ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉంది.
2016 RPWD చట్టం సెక్షన్ 92(A),(B),(E) కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు

Read More అపదలో అండగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు