దళితులపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు దాడి - ఖబర్దార్ చంపేస్తాం నా కొడకల్లారా
మాలల పై వీరంగం సృష్టించిన
ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జక్కిడి రఘు వీర్ రెడ్డి
విశ్వంభర, చైతన్యపురి : దళిత సామాజిక వర్గానికి చెందిన వినాయకుడి నిమజ్జనములో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జక్కిడి రఘు వీర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఒక మహిళకు చేయి విరగడం జరిగింది. చికిత్స నిమిత్తం ఆమెను సాయి సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు. వినాయక శోభాయాత్రలో భాగంగా చెరుకు తోట కాలనీ కి చెందిన దళిత యువకులు, మహిళల పై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరులు జక్కిడి రఘువీరారెడ్డి, విజయ్ రెడ్డి, ప్రతీక్ లతో పాటు దాదాపు 20 మంది అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వినాయక నిమజ్జనానికి చెరుకుతోట కాలనీ మాల సామాజిక వర్గానికి చెందిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్రను అరబిందో కాలేజ్ మీదుగా వెళ్తున్న సందర్భంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులైన జక్కిడి రఘువీరారెడ్డి తన అనుచరులతో కలిసి శోభాయాత్రను అడ్డుకొని ఇష్టానురీతిన కుల దూషణ చేస్తూ యువకులపై మూకుమ్మడిగా దాడి చేశారని ,అడ్డుకోబోయిన కాలనీ వాసులు , మహిళలపై కూడా బలమైన ఆయుధాల (రాడ్స్ ) తో కొడుతూ దుర్భాషలాడుతూ దాడి చేసారని తెలిపారు. ఇదే విషయం పైస్పందించిన తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్ దళిత వర్గాలపై దాడులు చేయడం సిగ్గు చేటు అని అన్నారు. న్యాయం చేయమని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు రాత్రి రెండున్నర గంటల నుండి ఐదున్నర గంటల వరకు భాదితులు వేచి చూసారని అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో తెల్లవారుజామున తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్ పోలీస్ స్టేషన్ చేరుకొని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ను చరవాణి ద్వారా సంప్రదించగా నిర్లక్ష్య వైఖరితో , ఫోన్ పెట్టెయ్ నాకు అన్ని తెలుసు అని వ్యంగంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే గాయపడిన బాధితులతో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి భాదితులకు అండగా ఉంటామని దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
అకారణంగా దాడి చేసి మహిళలు అని కూడా చూడకుండా కులం పేరుతో దూషించిన జక్కడి రఘువీర్ రెడ్డి అలాగే అనుచరుల మీద ఎస్సి, ఎస్టి అట్రాసిటీ తో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే మాల సంఘాలతో పోలీస్ స్టేషన్ ఎదురుగా సత్యాగ్రహ దీక్షలు చేపడతామని తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహేశ్వరం నియోజవర్గం దళిత సంఘాల నాయకులు ఎంగాలా యాదగిరి, మీర్పేట కార్పొరేటర్ గజ్జల రామచంద్ర, నాయకులు ఆవుల జనార్ధన్, శివరాజ్, కృష్ణ, యాదగిరి, రమేష్ లు పాల్గొన్నారు.