శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి. - చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు. - తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్
On
విశ్వంభర, తుర్క యంజాల్ :- కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అధ్యక్షతన 27-09-2025 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తుర్క యంజాల్ లోని ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో జయంతోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని కోశాధికారి జెల్ల రఘు ఓ ప్రకటనలో తెలియజేసారు. ఈ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత ఐక్య వేదిక సభ్యులు , పలు జిల్లాల నేతలు , ఐక్య వేదిక కార్యవర్గాలు పాల్గొంటాయని తెలిపారు. అలాగే ఈ ఉత్సవాలకు పద్మశాలి , చేనేత , బీసీ సంఘాల నాయకులూ హాజరు అవుతారని అన్నారు.



