క్యాన్సర్ సోకిన చిన్నారికి కోమటిరెడ్డి అభయం..
నల్గొండలోని శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇందులో ఓ పదేళ్ల చిన్నారి ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ చిన్నారికి కేవలం పదేండ్ల వయసులోనే క్యాన్సర్ సోకింది. దాంతో మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు.
నల్గొండ పట్టణానికి చెందిన హరీష్, సరితల కూతురు లిషిత క్యాన్సర్ బారిన పడింది. అతి పేద కుటుంబం అయిన వారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభయం ఇచ్చారు. చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆమెలో ధైర్యం నింపేలా మాట్లాడారు. యువరాజ్ సింగ్ కథను చెప్పి.. క్యాన్సర్ ను ఎదురించాలని ఆమెలో స్ఫూర్తి నింపారు.
దాంతో చిన్నారి కూడా తనకు ఇక భయం లేదు అన్నట్టు రోజూ స్కూల్ కు వెళ్తానని ప్రామిస్ చేసింది. ఇప్పటికే లిషితకు కీమోథెరపీలు రెండు దఫాలుగా అయిపోయాయి. ఇక మంత్రి వెంటనే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే రూ.50వేలు సహాయం అందించారు. రేపు సాయంత్రం మరో రెండు లక్షల సహాయం అందిస్తానని మాటిచ్చాడు. దాంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ మంత్రి చొరవపై ప్రశంసలు కురిపిస్తున్నారు.