స్వయంగా ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

స్వయంగా ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

 

మాజీ సీఎం కేసీఆర్ కు గతంలో తుంటి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన కర్ర పట్టుకుని నడిచారు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ను కారు డ్రైవ్ చేసి చూడమని డాక్టర్లు సలహాలు ఇచ్చారంట. 

Read More కస్తూర్బా గాంధీ  పాఠశాల/కళాశాల  తనిఖీ చేసిన:సబితా ఇంద్రారెడ్డి  

ఇందులో భాగంగా ఆయన గురువారం రోజున తన పాత ఓమ్నీ కారును స్వయంగా నడిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓల్డ్ మోడల్ మారుతి ఓమ్ని వెహికల్‎ని తెప్పించారు. ఇప్పుడు రెండవ దశలో తుంటి గట్టి పడాలంటే స్వయంగా కారు నడపాలని డాక్టర్లు సూచించడంతో కేసీఆర్ ఇలా తన ఫామ్ హౌస్ లో కారునడిపారు. నిజానికి కేసిఆర్‎కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన ఓమ్నీ కారు నడుపుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.