కాయ్ రాజా కాయ్ లక్షకు లక్ష...రెండు లక్షలకు రెండు లక్షలు

ttGiz1CiOtc-HD

విశ్వంభర చింతపల్లి జులై 09 :- కాయ్ రాజా కాయ్ లక్షకు లక్ష...రెండు లక్షలకు రెండు లక్షలు ఆలోచించిన ఆశాభంగం మంచితరుణం మించినా దొరకదు అంటూ పెట్టిన పెట్టుబడికి అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపించి సుమారు 50 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు ఓ ఘరానా మొనగాడు మదిని మనీష్ రెడ్డి తండ్రి సంజయ్ రెడ్డి అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుండి చింతపల్లి మండలం మాల్ (గొడకొండ్ల) వద్ద మణీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ పెట్టి వంద రూపాయలకు నెలకు వందతో ప్రారంభం చేసి పదివేలకు పదివేలు యాభై వేలకు యాబై లక్షకు లక్ష ఇలా కొందరికి చెల్లించి అదే గ్రామానికి చెందిన పది మంది ఏజెంట్లను తయారు చేసుకొని వారికి కారు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఆశా చూపి ఒక్కో ఏజెంటుకు 16000 వేల జీతం చెల్లీస్తూ నెలకు కోటి రూపాయలు తీసుకురావాలని టార్గెట్లు పెట్టి  చింతపల్లి మండలమే కాకుండా మర్రిగూడ, నాంపల్లి, యాచారం,

Read More స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

WhatsApp Image 2024-07-09 at 3.51.11 PM (1)

ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైదరాబాద్ ఇలా మండలాల నుంచి జిల్లాలకు తన బ్రాంచ్ ను విస్తరింపజేసి సుమారు 200మంది దగ్గర నుండి మొత్తంగా సుమారు 50 కోట్ల రూపాయలు స్వాహా చేసాడు అతగాడు. గత ఏడు నెలలుగా వడ్డీ చెల్లించక పోవడంతో అప్రమత్తమైన ప్రజలు నిలదీయడంతో మనీష్ రెడ్డి చింతపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. నన్ను జెల్లో పెట్టండి నేను గ్రామ ప్రజల పోరు తట్టుకోలేనని బీస్మించుకు కూర్చున్నాడు. గ్రామస్థులందరూ పోలీస్ స్టేషన్ కు వచ్చి మాకు వడ్డీ ఇవ్వకున్నా పర్లేదు అసలైన ఇవ్వు అని అడగగా నా దగ్గర రూపాయి కూడా లేదు జెల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా చంపేయండి అన సాగాడు. గ్రామస్తులు చేసేది ఏమిలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వద్దు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుందాం అని మనీష్ రెడ్డి ని పోలీస్ స్టేషన్ నుండి గ్రామానికి తీసుకెళ్లారు..

WhatsApp Image 2024-07-09 at 3.51.11 PM
చింతపల్లి మండలంతో  పాటు పరిసర ప్రాంతాలు, తెలిసిన వ్యక్తుల బలహీనతలు ఆసరాగా చేసుకుని తక్కువ పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే అధిక డబ్బులు, లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. ఇలా చాలా మందిని మోసం చేసాడని గ్రామస్థులు తెలిపారు.‘‘మనీష్ ఎంటర్ప్రైజెస్’’ పేరుతో సాగించిన ఈ దందాలో అదే గ్రామానికి చెందిన 9మంది ఏజెంట్లతో కలిసి 200 మంది నుండి 50కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తరువాతే వీరి అసలు రంగు బయటపడింది. ఓ ప్రభుత్వ బ్యాంకు క్యాషియర్ భర్త తన భార్యతో కలిసి రూ.65 లక్షల నగదు, ఓ ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్యాంకులో పని చేసే వ్యక్తి సైతం రెండు లక్షల ఇచ్చానని తెలిపారు. బాధితులకు చెప్పిన ప్రకారం డబ్బులు చెల్లించకుండా వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. పైగా తీసుకున్న సొమ్ము సైతం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఆశ్రయించనున్నారు.. అధిక వడ్డీలకు, స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ లు ప్రజలకు సూచిస్తున్న ఇలాంటి నేరాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి