బీసీలకు న్యాయం చేయాలి భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రం
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 22 : - భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు కడ్తాల్ మండల కేంద్రంలో ఎమ్మార్వో ముంతాజ్ బేగం కి బీసీలకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాలె శ్రీశైలం మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు స్థానిక రిజర్వేషన్ల కొరకు కుల గణన జరిపించి బీసీలకు 23 శాతం నుంచి 43 శాతం మధ్య స్థానిక బీసీలకు న్యాయం చేస్తాను అని. మరియు గొల్ల కురుమలకు గొర్ల పంపిని, బిసి విద్యర్థులకు స్కాలర్షిప్, ఆర్థికంగా వెనుకబడిన బీసీ కుటుంబాలకు లక్ష రూపాయల కార్పొరేషన్ లోన్లను ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాట పై నిలబడాలని లేదంటే బీసీలు తిరగబడటం ఖాయమని అన్నారు.
ఈకార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మాన్య నాయక్. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కాంటెకర్ భగీరథ్. మండల ప్రధాన కార్యదర్షులు దోనదుల మహేష్. జంగం వెంకటేష్. మరియు రాంచంధర్ కేతావత్ రెడ్యా నాయక్. బాణావత్ శంకర్ నాయక్ వెంకటేష్ శ్రీను, పాల్గొన్నారు