కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.
On
విశ్వంభర భూపాలపల్లి జూలై 22. భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ K.వెంకటేశ్వర్లు కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా రైతులు ప్రజలు జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోవాలని భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలపడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పూస్కుపల్లి గ్రామ ప్రజలకు అవసరం అయితే పునరావాస కేంద్రానికి రావాలని అవగాహన కల్పించడం జరిగినది. ఇందులో మండల స్పెషల్ ఆఫీసర్ మరియు DLPO వీరభద్రయ్య, తహశీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ ,మరియు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ , గిర్దవారి జగన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.