యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్
విశ్వంభర,హైద్రాబాద్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ,సీఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లుగా అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ హర్షం వ్యక్తం చేసారు.నిరుద్యోగులకు ,యువకులకు ఒక భరోసా ఇచ్చేవిధంగా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీయేనని కొనియాడారు.సీఎం,డిప్యూటీ సీఏం క్యాబినెట్ మంత్రులకు విద్యార్థి,నిరుద్యోగుల యువకుల పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు . బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్న పది ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడనికి ప్రచారం చేసి కీలక పాత్ర పోషించిన యువకులు,నిరుద్యోగులు కు వారు అనుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు.