కోర్టులో ఆస్తి కేసు.. మూడు రోజులుగా మార్చురీలోనే భర్త శవం..
కేసు వాపస్ తీసుకుంటేనే అంత్యక్రియలు చేస్తా
భీష్మించుకు కూర్చున్న భార్య
చెల్లెళ్లు, సోదరుడి వల్లే ఆత్మహత్య అంటూ ఆరోపణ
ఈ రోజుల్లో ఆస్తులకు ఇచ్చే విలువ కూడా బంధాలకు ఇవ్వట్లేదు. ఆస్తికోసం తోడబుట్టిన సోదరుడిపైనే కేసులు వేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు అంతకన్నా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తండ్రి ఆస్తి కోసం కోర్టులో చెల్లెళ్లు, సోదరుడు కేసు వేస్తేనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. కేసు విత్ డ్రా చేసుకుంటనే అంత్యక్రియలు నిర్వహిస్తానని ఓ భార్య భీష్మించుకుని కూర్చుంది.
దాంతో మూడు రోజులుగా ఆమె భర్త శవం మార్చురీలోనే ఉంది. ఈ దారణమైన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చోటుచేసుకుది. గ్రామాస్తుడు చీరిక హనుమంత రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ… అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డికి 7.24 ఎకరాల భూమి ఉంది.
అయితే తండ్రి ఆస్తిలో తన తమ్ముడితో హనుమంతరెడ్డికి తగాదాలు ఉన్నాయి. దాంతో తన తమ్ముడు, చెల్లెళ్లు కలిసి ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విషయంలో తరచూ గొడవలు జురుగుతండటంతో మనస్థాపానికి గురైన హనుమంతరెడ్డి పంతంగిలోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దాంతో తన భర్త మరణానికి సోదరుడు, చెళ్లెళ్లే కారణం అని.. కోర్టులో కేసు ఉపసంహరించుకుంటేనే అంత్య్రక్రియలు చేస్తానంటూ ఆమె భీష్మించుకుని కూర్చుంది. మూడు రోజులుగా పెద్ద మనుషులు నచ్చజెప్పినా వినట్లేదు. ఇక చివరకు బంధువుల ఒత్తిడితో మంగళవారం కేసును ఉపసంహరించుకున్నారు. దాంతో ఇప్పుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.