బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. -స్పందించిన బీసీ ప్రజా సంఘం మహిళా నేతలు.
పలు ప్రాంతాల్లో శాంతియుత బంద్
On
విశ్వంభర, హనుమకొండ జిల్లా :- స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై వరంగల్ జిల్లా బీసీ ప్రజా సంఘం మహిళా నేతలు స్పందించారు.బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా హై కోర్టు స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. శుక్రవారం బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న హై కోర్ట్ తీర్పు కి నిరసనగా వరంగల్ జిల్లా బీసీ మహిళ అధ్యక్షురాలు తురాయి రజిని,ఉప అధ్యక్షురాలు మంచాల పద్మ,ఆధ్వర్యంలో వరంగల్ లోని పలు ప్రాంతల్లో శాంతియుతంగా బంద్ పాటించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నా తురుణంలో.హై కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు.ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు.బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు.బీసీ ల రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడిన రాబోయే రోజుల్లో వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.బీసీ బిడ్డలు ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని.. వారి పక్షాన బీసీ ప్రజా సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో బిసి ప్రజా సంఘం మహిళ నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు



