వానపడిందా రోడ్డు బురదమయం
On
నడవలేం, ద్విచక్ర వాహనాల పైన ప్రయాణం చేయలేము
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 : -యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం లింగారాజుపల్లి గ్రామంలో బుధవారం రోజు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎర్ర రాజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాన వచ్చిందంటే చాలు రోడ్డు మొత్తం బురుదమయం అని నడుచుకుంటూ పోలేము బండిని కూడా నడుపలేము అని హైవే రోడ్డు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉందని ఎన్ హెచ్ 930 రోడ్డుకి ఆరు పర్లాంగుల దూరం ఉంది అన్నారు . గత ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజల బాధలు అర్థం చేసుకొని వెంటనే రోడ్డు వేయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి విజ్ఞప్తి చేశారు.