గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణలో ఈనెల 9న టీజీపీఎస్సీ 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. తాజాగా ఇవాళ(గురువారం) పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేశారు.

తెలంగాణలో ఈనెల 9న టీజీపీఎస్సీ 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. తాజాగా ఇవాళ(గురువారం) పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేశారు.  ఈనెల 17 సాయంత్రం 5 గంటల వరకు వరకు దీనిపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని కమిషన్ పేర్కొంది. 

ఇందుకోసం తొలుత టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలని సూచించారు. మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి ఆక్టోబర్‌ 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్ష కేంద్రాలన్నీ హైదరాబాద్‌లోనే ఉంటాయని తెలిపింది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ప్రతీ పేపర్‌కు 150 మార్కులు ఉంటాయని వివరించింది. 

Read More నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

అక్టోబర్ 21న  జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్),  అక్టోబర్ 22న పేప‌ర్‌-1 (జ‌న‌ర‌ల్ ఎస్సే), 23న పేప‌ర్‌-2 (హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ) – 24న పేప‌ర్‌-3 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌) 25న పేప‌ర్‌-4 (ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్), 25న పేప‌ర్‌-5 (సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్), 26న పేప‌ర్‌-6 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్)  నిర్వహించనున్నట్లు పేర్కొంది.