డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుందని తెలిపింది.
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుందని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం జీవో విడుదల చేశారు.
అయితే, ఇప్పటివరకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం అమలు చేసేది. తాజాగా ప్రభుత్వం ఐదు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్లు జీవోలో తెలపింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. దీంతో భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు.