గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కసరత్తులు స్టార్ట్.. రంగంలోకి మహిళా సంఘాలు

గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కసరత్తులు స్టార్ట్.. రంగంలోకి మహిళా సంఘాలు

 

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేసిన రేవంత్.. మరికొన్నింటిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కొన్నింటికి ఓకే కూడా చెప్పారంట. అయితే ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి.. ఇప్పుడు మిగతా గ్యారెంటీల అమలుపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైనది కొత్త రేషన్ కార్డుల జారీ. ఇప్పటికే వీటికోసం కసరత్తులు స్టార్ట్ చేశారంట. 

Read More పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై CM స్పందన

దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాకపోయినా.. మౌకిక ఆదేశాలతో అధికారులు కసరత్తులు స్టార్ట్ చేశారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. ఇక మిగతా జిల్లాల్లో మాత్రం మహిళా సంఘాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. గ్రామాల్లో కార్యదర్శులు, అంగన్ వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ఈ బాధ్యతలను చూస్తున్నారంట. ఇంటింటికీ వెళ్లి ఎంత మంది ఉన్నారో తెలుసుకుంటున్నారు. 

ఆ వివరాల ఆధారంగా ఎన్ని రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందనేది తెలుసుకోబోతున్నారు. ఇక ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది అప్లై చేసుకున్నారు. ఇంత మందిలో ఎవరికి ఇవ్వాలి, అర్హులను ఎలా గుర్తించాలనే దానిపై ప్రస్తుతం అధికారులు కసరత్తులు చేస్తున్నారు.