నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 5,348 ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 5,348 ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4,356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్  ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో నోటిఫికేషన్ పెండింగ్ పడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్‌లో డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం వంటి పోస్టులు ఉన్నాయి.  పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్యవిధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 

Read More మానవత్వం చాటిన మాజీ ఎంపీపీ  

అదేవిధంగా ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేయనుంది. వైద్యారోగ్య సర్వీస్ నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పోస్టులు భర్తీ చేయనున్నారు. 1255 డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో 34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

Tags: