BRS పార్టీ కి ఝలక్ మీద ఝలక్ .. BRS పార్టీకి గుడ్ బై చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

BRS పార్టీ కి ఝలక్ మీద ఝలక్ ..  BRS పార్టీకి గుడ్ బై చెప్పిన గద్వాల ఎమ్మెల్యే  బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

 

జూబ్లీహిల్స్ , విశ్వంభర :- BRS పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు  గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి.  శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని   సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం.రెండు రోజుల క్రితం BRS పార్టీ నుండి 6గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు.నేడు గద్వాల ఎమ్మెల్యే చేరడంతో BRS కు పెద్ద షాక్ తగిలినట్టుగానే ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో BRS ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నట్లు తెలుస్తుంది .ఈ కార్యక్రమంలో  పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు . 

Read More ముషీరాబాద్ పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 

 

 

Tags: