BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
On
24 జులై 2024 విశ్వంబర నల్లగొండ జిల్లా : - శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమ గాయకుడు, సాంస్కృతిక కళాసారది కళాకారుడు వేముల నరేష్ గారు ఇటీవల మృతి చెందారు వారికి ముగ్గురు పిల్లలు వేముల అభిషేక్, ధనుష్ , తన్వి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ముగ్గురు పిల్లల పేర్ల మీద SBI బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కొక్కరి మీద రూ.50,000/- (యాభై వేల రూపాయలు) చొప్పున మొత్తం ₹1,50,000/- (ఒక లక్ష యాభై వేల రూపాయలు) ఫిక్సీడ్ డిపాజిట్ చేయించి బాండు పేపర్ ను వారి కుటుంబ సభ్యులు వేముల శైలజ గారికి BRS మండల పార్టీ అగ్రశ్రేణి నాయకులు అందించారు
ఈ సందర్భంగా వేముల శైలజ గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కు కోల్పోయిన మాకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఒక లక్ష యాభై వేల రూపాయలు పిల్లల పేర్ల మీద డిపాజిట్ చేయించి మా కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు