కడ్తాల్ మాజీ జడ్పిటిసి అరెస్ట్
విశ్వంభరా ఆమనగల్లో జులై 17 అక్రమ అరెస్టులతో ప్రజా గొంతుకలను ఆపలేరు. అని కర్తాల్ మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ అన్నారు
కడ్తాల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల మంత్రులతో ప్రారంభోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ ను ముందస్తుగా అరెస్టు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి కస్తూర్బా పాఠశాలను మండల కేంద్రానికి మంజూరు చేయించి పూర్తి పనులు చేసామని తన పదవి చివరి రోజు కూడా కేజీబీవీ పాఠశాల గురించి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం లో పాఠశాలలో నెలకొన్న కరెంటు సమస్యను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించిన నేను పాఠశాలను ఎలాగైనా ప్రారంభించాలని నిరాహార దీక్షకు ఇచ్చామని అలాంటిది నేను ఎందుకు ప్రారంభాన్ని అడ్డుకుంటానని అన్నారు పోలీసులు తన నివాసంలో అక్రమ అరెస్టుకు పాల్పడడం ఇది అప్రజా స్వామీకం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల గురించి మంచి చేయాలని ఉద్దేశంతో మా పోరాటాలు ఉంటాయి తప్ప ఎవరినో అనవసరంగా చేసే ఉద్యమాలు కావని అన్నారు.