కాలేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.

కాలేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.

 

విశ్వంభర భూపాలపల్లి జూలై 22. : - భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా వచ్చే చేరుతుంది.8,68,850 క్యూసెక్కుల నీరు వచ్చే చేరుతుండగా మొత్తం నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి నది పర్వాలు తొక్కుతోంది. నదీ ప్రవాహం 12.25 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఎమ్మార్వో ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్సై చక్రపాణి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ లు నిరంతరం వరద నీటిని పర్యవేక్షిస్తూ భక్తుల స్నానాలను నిలిపివేశారు. గోదావరి నది ఒడ్డు వద్ద ఉన్న షాపులను ఖాళీ చేయించారు. మహారాష్ట్రలోని భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాటు వద్ద మెట్ల న్ని మునిగి వరద ప్రవాహం ఒడ్డు పైకి చేరుతుంది. దీంతో స్థానిక పోలీసులు నది వద్ద కాపలాగా ఉంటూ భక్తులను, గ్రామస్తులను, ప్రజలను నది వద్దకు రాకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించట్లేదని తెలిపారు. ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ఉన్నందువలన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.WhatsApp Image 2024-07-22 at 11.43.33_61c42d65

Read More మహిళా విభాగ్ అధ్యక్షరాలికి బుక్కా ఈశ్వరయ్య అభినందనలు