పాడి రైతులకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందించాలి - పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా
వ్యవసాయం చేసుకునే యువ రైతులు పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలను ఇవ్వడం లేదు
పెద్ద చదువుల కోసం ఐటి కడుతున్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి
విశ్వంభర, ఆమనగల్లు:- జూలై 4: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆమనగల్లు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక రైతు వేదికలో జరిగిన రైతుల ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టా భూమి కలిగిన పాడి రైతులకు కౌలు రైతులకు అదేవిధంగా ఇన్కమ్ టాక్స్ కట్టే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని అన్నారు రైతులకు ఐటి లేకపోతే రైతు బిడ్డలకు పెద్ద చదువులు చదివే అవకాశం కోల్పోతారు కాబట్టి తప్పనిసరి రైతులు ఐటీ కడుతున్నారని కాబట్టి వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని అన్నారు గత సంవత్సరం రెండు నుంచి మూడు లక్షల క్వింటాల దాకా ధాన్యం సేకరించామని ఈ సంవత్సరం 20, 30 వేల క్వింటాళ్లు కూడా కొనలేదని రైతులు వడ్లను ఆరబెట్టలేక తరుగుకు భయపడి దళారులకు క్వింటాలుకు 500 రూపాయల తక్కువకు అమ్ముతున్నారని సన్నవి, దొడ్డువి అంటూ ప్రభుత్వం రేట్లు పెట్టిందని ఇప్పటినుండి ఒకటే రకం కొనసాగించాలని అన్నారు.
వైస్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతు యువకులు పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిని ఎవరు ఇవ్వడం లేదని, సైనికులు బార్డర్లో ఇలాగైతే వానకు, ఎండకు కష్టపడి దేశ భద్రత కోసం ఎలాగైతే కష్టపడుతున్నారో రైతులు కూడా అదేవిధంగా వానకు ఎండకు కష్టపడి దేశంలోని ప్రజలకు పట్టే న్నం పెట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి వారి సమస్యలను తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రైతులు వారి వారి అభిప్రాయాలను వెల్లడి చేశారు కొంతమంది రైతులు 10 ఎకరాల వరకు రైతు భరోసాలు ఇవ్వాలని తెలియజేశారు మరికొందరు సాగుచేసే ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా అందజేయాలని తెలియజేశారు అదేవిధంగా వ్యవసాయ పరికరాలను మరియు విత్తనాలను ఎరువులను పై తరలను తగ్గించాలని కోరారు అదే విధంగా ఎక్కువ భూమి ఉన్న రైతుల పొలాల కు రైతు భరోసా ఇవ్వకుండా మిగిలిన డబ్బులను వ్యవసాయానికి సంబంధించిన పనులకు ఉపయోగించాలని, రైతు భరోసాలు చిన్న కారు,
సన్నకారు రైతులకు ఎక్కువ మొత్తంలో అందజేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నాగలింగం, మాజీ చైర్మన్ ధనుంజయ, వైస్ చైర్మన్ పోలేపల్లి సత్యం, జోగు వీరయ్య ఏవో అరుణకుమారి, సింగిల్ విండో డైరెక్టర్స్ చేగూరి వెంకటేష్, శ్రీపాల్, ముదివెన్ వెంకటేష్, రమేష్, సిబ్బంది దేవేందర్, అల్లాజి, అధికారులు రైతులు, పాల్గొన్నారు.