రైతులకు రైతుబంధు లేదు కానీ? కొడంగల్ కి 4,370 కోట్లు
విశ్వంభర, కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి రుణమాఫీ చేసి రైతుబంధు నిధులు పక్కదోవ పట్టిస్తూ ఆ ఊసే ఎత్తకుండా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు 4,370 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు డీకే మాదిగ మండి పడ్డారు. రైతు భరోసా కింద రైతులకు 15000 రూపాయలు వేస్తానని, కౌలు రైతులకు 15000 రూపాయలు , వలస కూలీలకు 12,000 రూపాయలు, ఈ రైతులకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా ఏమార్చి రుణమాఫీ పేరుతో ప్రజలను ఆకర్షించడానికి మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఇచ్చే రైతుబంధు డబ్బులు ఏక్కడికి పోయాయో ? శ్వేత పత్రం విడుదల చేయాలని డీకే మాదిగ ముఖ్యమంత్రి ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలర్ మహేష్, వినయ్, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు