చికిత్స పేరుతో డాక్టర్ల దారుణాలు.. తనిఖీల్లో సంచలన నిజాలు..!

 చికిత్స పేరుతో డాక్టర్ల దారుణాలు.. తనిఖీల్లో సంచలన నిజాలు..!

 

ఈ రోజుల్లో వైద్యం వ్యాపారం అయిపోయింది. అమాయక ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. కొందరు అయితే అర్హత లేకున్నా సరే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఆస్పత్రుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు అధికారులు. 

Read More ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు 

అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‎లపై ఎన్.ఎం.సీ చట్టం 34, 54 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరిపెడ మండలో కొందరు ఆస్పత్రులను పెట్టుకుని అర్హత లేకున్నా డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని వారి దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో వారు తనిఖీలు చేయగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

రామారావు క్లినిక్, శ్రీనివాస ప్రథమ చికిత్స కేంద్రం, బీవీ నాయక్ ఫస్ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు రామారావు, బీవీనాయక్, ఇస్లావత్ వీరన్నను నకిలీ డాక్టర్లుగా గుర్తించారు. వీరి ఆస్పత్రులను మూసేసి అందరిపై కేసులు నమోదు చేశారు అధికారులు.